Sunday, November 10, 2024

TG I సూర్యాపేట, భద్రాచలంలో నేడు గవర్నర్ పర్యటన

హైదరాబాద్ – మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో జరిగే రివ్యూ కార్యక్రమానికి హాజరుకానున్నారు గవర్నర్.

ఉదయం సూర్యాపేట కలెక్టరేట్‌ లో జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించనున్నారు.

అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు. ఇక సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం బయలుదేరి వెళతారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement