Friday, November 15, 2024

TG – నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వరద నీరు….

నిజాంసాగర్ సెప్టెంబర్ 01(ప్రభ న్యూస్ ) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ప్రాజెక్ట్ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 00అడుగులు కాగా ప్రస్తుతం 1392.00 అడుగులతో 4.962టీఎంసీ ల నీటి నిల్వతో కొనసాగుతుండగా 8600 క్యూసెక్కుల వరద నీరు వఛ్చి చేరు తుందని అయన తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులోకి వరద నీటి ప్రభావం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేర్చే పోచారం, సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరు తుందని వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు.

కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.

- Advertisement -

సింగీతం రిజర్వాయర్ ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల. నిజాంసాగర్ సెప్టెంబర్ 01(ప్రభ న్యూస్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన సింగితం,కళ్యాణి ప్రాజెక్ట్ లు పూర్తి స్థాయిలో నిండటం తో కళ్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని మంజీరానది లోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగితం రిజర్వాయర్ నుండి వెయ్యి క్యూసెక్కులు కళ్యాణి ప్రాజెక్టు నుండి 150 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి మళ్లించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement