Sunday, October 13, 2024

TG – ఆ భూములు ఆ వ‌ర్శిటికా… వ‌ద్దంటే వద్దు… రేవంత్ కు విద్యావేత్తలు లేఖ

ఓపెన్ వ‌ర్శిటీ భూములు జెన్టీయుకి
వెన‌క్కి తీసుకోవాలంటూ కోదండ‌రామ్ తో స‌హా
ప‌లువురు విద్యావేత్త‌లు రేవంత్ కు లేఖ‌
పేద‌లు చ‌దువుతున్న వ‌ర్శిటి భూములు ఇత‌రుల‌కు వద్దు
నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించండి….

హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ కు ప‌లువురు విద్యావేత్త‌లు బ‌హిరంగ లేఖ రాశారు..
పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో ఉన్నత చదువులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ అని, కాబట్టి ఆ వర్సిటీ భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించవద్దని కోరారు. అంబేద్కర్ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరాం, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement