Friday, October 4, 2024

TG నేడే డీఎస్సీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఇవాళ తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఇవాళ తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ 2024 ఫలితాల విడుదల కానున్నాయి…

ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి డీఎస్సీ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement