Monday, October 7, 2024

TG – పేదల ఇళ్ళు కూల్చడం అన్యాయమే – దానం నాగేందర్

హైదరాబాద్ – పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని ఎంఎల్ఏ దానం నాగేందర్ అన్నారు. నేడు ఆయన మీడియా తో మాట్లాడుతూ, . ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాలని తెలిపారు. నిర్ణయించిన బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కూల్చిన ఇళ్లను అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు దాన తెలిపారు: మూసీ పరివాహక ప్రాంతాల్లో జోలికి హైడ్రా వెళ్లకూడదని ముందే చెప్పానంటూ పేర్కొన్నారు.

చెరువులోనే జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వాటిని కూలుస్తారా అని ప్రశ్నించారు.

.హైడ్రా కూల్చివేతలపై ఈటెల రాజేందర్ కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు సాధారణంగా డిగ్నిఫయిడ్ గా ఉంటారు. ఆయన కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి కావాలని రచ్చ చేస్తున్నారన్నారు. వాళ్ళ హయంలో కేసీఆర్ కూడా అన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తమనీ.. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

,చిన్న పాప నా బుక్స్ లోపల ఉండిపోయాయి అనే వీడియో చూస్తుంటే దుఃఖం ఆగలేదు అంటూ దానం కన్నీరు పెట్టుకున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement