Friday, October 11, 2024

TG – ఆర్టీసీ బస్సులో ప్రసవం

మ‌హిళా ప్ర‌యాణీకులే మంత్ర‌సానులు
పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న‌నం
కోదాడ వెళ్లన్న బ‌స్సులో ఘ‌ట‌న

సూర్యాపేట ప్రభ న్యూస్ – సూర్యాపేట నుండి కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించింది. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ అలివేలు పురిటి నొప్పులతో బాధపడుతున్నంగా ఆర్టీసీ డ్రైవరు స్పందించి బస్సును పక్కకు ఆపివేశాడు. తోటి మహిళా ప్రయాణికులే మంత్ర‌సానులై ఆమెకు పురుడు పోశారు.. ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. వెంటనే సిబ్బంది 108కు కాల్ చేసి ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారు. పురుడు పోసిన మ‌హిళ‌ల‌ను, డ్రైవర్, కండక్టర్లను తొటి ప్ర‌యాణీకులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement