Friday, December 6, 2024

TG Cab : జాతీయ సహకార వారోత్సవాలను ప్రారంభించిన రవీందర్ రావు

పర్వతగిరి, నవంబర్ 14 (ఆంధ్రప్రభ) : భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ టీజీ క్యాబ్ ప్రధాన కార్యాలయంలో 71వ జాతీయ సహకార వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు ప్రారంభించి సహకార జెండాని ఎగురవేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే నినాదంతో ఈ సహకార ఉద్యమం శతాబ్దానికి పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక ఆర్థిక ప్రయత్నాల్లో ఒకటిగా ఉద్భవించిందన్నారు. వికసిత్ భారత్ దృక్పథాన్ని సహకారం చేయడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తూ 71 అఖిల భారత సహకార వారంగా జరుపుకుంటున్నామన్నారు. సహకార సంఘాల కృషిని ప్రోత్సహిస్తూ వాటి అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేశించడానికి ఈ వేదిక ముఖ్యమైనదని, ఔత్సాహికతను పెంపొదిస్తూ సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహకం ఇవ్వడమ‌న్నారు.

జీవనోపాధిని సృష్టించడం ద్వారా సహకార సంస్థలు అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయని, భారత దేశం 8.5 లక్షలకు పైగా నమోదిత సహకార సంఘాలకు నిలయంగా ఉందన్నారు. దాదాపు 28 కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత ప్రయాణంలో సహకార రంగాన్ని కీలక శక్తిగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం జ్యోతి, జీఎం సురేఖ, ఎంఆర్ శ్రీనివాస్, సుజాత, యూనియన్ నాయకులు విజయ్, కృష్ణమూర్తి, డీజీఎం లు, ఏజీఎంలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement