Saturday, December 7, 2024

TG – డ్వాక్రా గ్రూపుల‌కు భారీగా రుణాలు – బ్యాంక‌ర్ల‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ఆదేశం

హైద‌రాబాద్ – స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. ప్రజా భవన్లో నేడు జ‌రిగిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశమన్నారు.

“కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు తొమ్మిది నుంచి.. 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలి. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది. అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉంది. హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలి. అని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, మధ్యతర పరిశ్రమ క పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు విశాలా దృక్పథం గొప్ప హృదయంతో సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 12 వేల కోట్ల పైగా టర్నోవర్ చేస్తున్నారు.. ఇదే సమయంలో గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు సుమారు 200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపారు.

హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించామ‌న్నారు భ‌ట్టి, వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలే అని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకువస్తున్నామ‌ని, , బ్యాంకర్లు సహకరించాలని కోరారు.

హైడ్రా గురించి ఆందోళ‌న వ‌ద్దు..

బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కులు పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని బ్యాంక‌ర్ల‌కు వివ‌రించారు.

ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా, ప్రోగ్రెసివ్ స్టేట్‌గా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నామ‌న్నారు.. బ్యాంకర్లు విస్తరించాలని కోరుకుంటున్నామ‌ని.. బ్యాంకర్లు పెరిగితే రాష్ట్రం పెరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సెర్ఫ్ సీఈఓ దివ్యదేవరాజన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement