Tuesday, October 8, 2024

TG – బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే – బండి సంజయ్

కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతి..

మూసీ పేరుతో కాంగ్రెస్ రూ.లక్షణ్నర కోట్ల దోపిడీ ..

హైడ్రాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు … కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆంధ్రప్రభకాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అవినీతి పార్టీలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్ల ప్రజాధనం దోచుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ను మించి మూసి పేరిట లక్షన్నర కోట్ల దోపిడీకి సిద్ధమైనదన్నారు.

- Advertisement -

జీతాలకే పైసల్లేవు

మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు.హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని,ఇదేనా ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు.ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా అని ఎద్దేవా చేశారు.

అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని,హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెర తీసిందన్నారు.పేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని,ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతోందన్నారు.

.ప్రజలకు మా ప్రాణాలను అడ్డుపెడతామని,మా ప్రాణాలు తీశాకే ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లాలన్నారు.హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందన్నారు.

కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని, తమిళనాడులో తండ్రి సీఎం, కొడుకు డిప్యూటీ సీఎం ఉండటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే సహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులు ఇచ్చే సంస్కృతి లేదన్నారు.కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement