Tuesday, November 12, 2024

TG – చెన్నూరుకు ఉప ఎన్నిక‌లు ఖాయం – ఎమ్మెల్యే వినోద్ జైలుకు పోవ‌డం తథ్యం: బాల్క సమ‌న్

ఈడీ త‌నిఖీల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వెల్ల‌డి..
సిఎం రేవంత్ సైతం కాపాడ‌లేర‌న్న బిఆర్ఎస్ నేత బాల్క సమ‌న్

హైద‌రాబాద్ – చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. సూటుకేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవటం‌ ఖాయమన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరన్నారు. ఈడీ కేసు జరుగుతుంటే‌.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తామని వెల్లడించారు. వివేక్‌‌.‌. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు.

- Advertisement -

పోలీసుల‌కు స్వామి భ‌క్తి ఎక్కువైంది..

తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైందని విమర్శించారు బాల్క సుమ‌న్ . పోలీసులు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారని మండిపడ్డారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని హెచ్చరించారు. ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ తాజా పరిణామాలను తెలంగాణ పోలీసులు గుర్తుంచుకోవాలని తెలిపారు. జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది.. తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు ఇంటికి పంపారన్నారు. చేసిన తప్పుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ సుమన్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement