Monday, October 7, 2024

TG – ఒకేరోజు ఎసిబి కి చిక్కిన నాలుగు అవినీతి తిమింగలాలు

హైదరాబాద్: నలుగురు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పనులు చేసిపెట్టేందుకు గాను లంచం డిమాండ్ చేసిన అధికారులపై కొరడా ఝులిపించారు. జనగాం జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిలుకపాటి హుస్సేన్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ అడవాల రవీందర్‌లు వరుసగా రూ.12,000, రూ.2,000 లంచం డిమాండ్ చేశారు. వారు ఆ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కాగా.. ఎన్‌ఓసి జారీకి, వరంగల్ పోలీస్ కమిషనర్‌కు రిమార్క్‌లను ఫార్వార్డ్ చేయడానికి, లింగాల ఘణపూర్ గ్రామంలో కొత్త పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కోసం నిందితులు లంచం డిమాండ్ చేశారు. హుస్సేన్‌ నుంచి రూ.12వేలు, ఏఈఈ కార్యాలయం నుంచి రూ.2వేలు లంచం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు.

- Advertisement -

రంగారెడ్డిలోని రెసిడెన్షియల్ పాఠశాల మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ వి ప్రభుదాస్.. రూ.29వేలు లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్క్ తో పాటు బిల్లును ప్రాసెస్ చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు దారుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడైన అధికారి నుంచి లంచం స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎస్పీ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

సంగారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామం & మండల పంచాయతీ కార్యదర్శి ఎండీ షకీల్ నివాస ధృవీకరణ పత్రం ఇవ్వడానికి రూ. 5,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు బాధితుడి నుంచి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

కాగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్‌ఫ్రీ నంబర్‌)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement