Thursday, April 18, 2024

నేటి నుంచి పది పరీక్షలు షురూ.. జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు వచ్చే నెల 1 వరకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు ఉంటాయి. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 406 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం. అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లిలో కేవలం 20 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి.గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. అయితే ఈ సారి అనుకూల పరిస్థితులుండటంతో ..పరీక్ష సిలబస్‌ ను 70 శాతానికి కుదించి..11 పేపర్లకు గాను ఆరు పేపర్లకు తగ్గించారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 86 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈవో రోహిణి ప్రభన్యూస్‌తో చెప్పారు.

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లాలో పది పరీక్షల నిర్వహణక అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హెదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల నుంచి ఈ పరీక్షలకు దాదాపు 78 వేల మంది హాజరుకానున్నట్లు సమాచారం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నా ం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 406 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 406 పరీక్ష కేంద్రాలున్నాయి. జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాలో అత్యల్పంగా కేవలం 20 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి మొత్తం 17 ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌ ను..ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు, సమీపంలోని జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గంటముందుగానే చేరుకోవాలి:
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని హైదరాబాద్‌ జిల్లా డీఈవో ఆర్‌.రోహిణి సూచించారు. పది పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలపై ఆదివారం ప్రభన్యూస్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పరీక్ష కేంద్రానికి గంట ముందుగా రావడం వల్ల విద్యార్థులు టెన్షన్‌కు గురికాకుండా ఉంటారన్నారు. స్మార్ట్‌ ఫోన్లు, వాచ్‌లు ఇతర పరికరాలు(గ్యాడ్జెట్స్‌) అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అయితే పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాల వెసులుబాటుతో 9 గంటల 35 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఎంట్రీ చేయరని తెలిపారు. అందువల్ల విద్యార్థుల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్స్‌ సెంటర్లోకి వెళ్లిన వెంటనే విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను చెక్‌ చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే ఎగ్జామినర్‌ కు తెలిపితే తగిన పరిష్కార చర్యలు చేపడతారని వివరించారు. అంతేకాకుండా ఇతరత్రా ఏ సమస్యలున్నా..డిప్యూటీ ఈవోలను మొబైల్‌ నంబర్లలో సంప్రదించాలని కూడా ఆమె సూచించారు.

డిప్యూటీ ఈవోల నెంబర్లు:
జోన్‌ ప్రాంతీయ ఉప విద్యాధికారి మొబైల్‌ నంబరు
అమీర్‌పేట ఎస్‌.చిరంజీవి 7207338520
బహదూర్‌ పుర సయ్యద్‌ ఖాజా ముఖరం 9985189218
బండ్లగూడ ఆర్‌.బాలునాయక్‌ 9492183171
చార్మినార్‌ సయ్యద్‌ ఖాజా ముఖరం 9985189218
గోల్కొండ బి.వెంకటేశ్వర్లు 9032134582
హిమాయత్‌నగర్‌ జి.శ్రీధర్‌ 9849719609
ఖైరతాబాద్‌ ఎస్‌.చిరంజీవి 7207338520
మారెడ్‌పల్లి కె.యాదయ్య 9948441336
ముషీరాబాద్‌ ఎం.సామ్యూల్‌రాజు 8121267750
నాంపల్లి బి.వెంకటేశ్వర్లు 9032134582
సైదాబాద్‌ ఎం.విజయలక్ష్మి 9989689718
సికింద్రాబాద్‌ జి.బి సురేష్‌కుమార్‌ 9989913611

Advertisement

తాజా వార్తలు

Advertisement