Friday, October 11, 2024

Telegana – ప్ర‌వాసి ప్ర‌జావాణి ప్ర‌త్యేక కౌంట‌ర్ ప్రారంభించిన పొన్నం

మొద‌టి అభ్య‌ర్థ‌న స్వీక‌రించిన మంత్రి పొన్నం
గ‌ల్ఫ్ బాధితుల కోసమే : మంత్రి ప్ర‌భాక‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం ప్ర‌తి బుధ, శుక్రవారాలు ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నుంది. గ‌ల్ఫ్ బాధితులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డానికి ప్ర‌వాసి ప్ర‌జావాణి వేదిక‌గా ఉంటుంది.

మొద‌టి అభ్య‌ర్థ‌న స్వీక‌రించిన మంత్రి పొన్నం
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రవాసి ప్రజావాణి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నాషేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వ‌చ్చి ఫిర్యాదు ఇచ్చారు.

- Advertisement -

గ‌ల్ఫ్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికే : మంత్రి
ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పినట్టు నాలుగు అంశాల పై నిర్ణయం తీసుకున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామ‌ని చెప్పారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement