Friday, April 26, 2024

టిఆర్ఎస్ లోకి రండి.. ఎల్. రమణకు కెసిఆర్ ఆహ్వానం

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి తెలంగాణ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన టీఆర్ఎస్ లోకి వెళితే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎల్.రమణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ వెల్లడించారు. దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. సీఎం కేసీఆర్ తో పలు అంశాలు మాట్లాడానని, సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళదామని ప్రతిపాదించారని రమణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement