Friday, April 19, 2024

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. జెండా ఎగ‌ర‌వేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, ప్రభ న్యూస్.. జుక్కల్ నియోజక వర్గంలోని నిజం సాగర్, పిట్లం, జుక్కల్, డోంగ్లి, బిచ్కుంద,, పెద్ద కొడంగల్, మండలాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జాతీయ పత‌కాన్ని ఆవిష్కరించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, బిచ్కుంద ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అశోక్ పటేల్, సర్కిల్ కార్యాలయంలో సిఐ కృష్ణ, పలు కార్యాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆయా శాఖ అధికారులు సర్పంచులు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద జడ్పిటిసి భారతీరాజు, మండల కో ఆప్షన్ సభ్యులు సిద్ధిక్, బిచ్కుంద సొసైటీ చైర్మన్ బాలాజీ శ్రీహరి, బిచ్కుంద మండల బారాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, మైనార్టీ నాయకులు షేక్ పాషా, మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు అసద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement