Saturday, April 20, 2024

ఇంటర్‌ బోర్డులో డేటా చోరీ – అధ్యాప‌కుల సంఘ నేత‌పై ఫిర్యాదు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ బోర్డులో డేటా చోరీ అయ్యిందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌ బోర్డుకు సమాంతరంగా మరో కమిషనర్‌ వ్యవస్థను ఓ వ్యక్తి నడిపిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌ బోర్డు వ్యవస్థను పూర్తిగా ఒక వ్యక్తి తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో సీసీ కెమెరాలను ట్యాంపర్‌ చేశారని, తాను ఓ అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయని, పాస్‌వర్డ్‌ను కూడా సదరు వ్యక్తే రన్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బోర్డు డేటాను చోరీ చేశారని పేర్కొంటూ ఓ లెక్చరర్ల సంఘం నేతపై పోలీస్‌ స్టేషన్‌లో కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఫిర్యాదు చేశారు.

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాం కనంపై కోర్టు కేసులు ఉన్న ఒక వ్యక్తి ఆరోపణలు చేశారన్నారు. విద్యార్థుల్లో లేనిపోని ఆందోళనలు సృష్టించేందుకే నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు. నాంపల్లిలోని ఇంటర్‌ విద్యా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో నవీన్‌ మిట్టల్‌ ఈ విధంగా మాట్లాడారు. ఇంటర్‌ బోర్డులో సీసీ టీవీ ట్యాంపరింగ్‌ జరిగిందని, దీనికి కారణం కూడా ఆ వ్యక్తే అన్నారు. ఆన్‌లైన్‌ వ్యాల్యూయే షన్‌తో మంచి ఫలితాలొస్తాయని అన్నారు. గతంలో వ్యాల్యూయేషన్‌కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయ న్నారు. విద్యార్థులకు మార్కులు తక్కువగా వస్తే చెక్‌ చేసుకునేందుకు చాలా ఇబ్బంది పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. గతంలో రీ వ్యాల్యూయేషన్‌కి విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే జవాబు పత్రాలు కూడా దొరికేవి కావని, దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనంపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తికి వచ్చే నష్టమేంటోనని తాము ఆరాతీశామని, గతంలో మ్యాన్యువల్‌గా వాల్యూయేషన్‌ జరిగే క్యాంపు ల్లో కొందరిని ఆ సదరు వ్యక్తి మేనేజ్‌ చేసేవాడని తమకు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. జవాబు పత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా ట్రాక్‌ చేసేవాడని తేలినట్లు నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు.
ఇంటర్‌ బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టేందుకు టెండర్లు ఆహ్వా నిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆర్ట్స్‌, లాంగ్వేజ్‌ల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌ పద్ధతిలో వ్యాల్యూయేషన్‌ చేస్తామని చెప్పినట్లు గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క సెమిస్టర్‌కు 30లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నామన్నారు. ఇంటర్‌లోనూ దాదాపు 35 లక్షల వరకు పత్రాలను మూల్యాంకనం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బ్లాక్‌ లిస్టులో పెట్టిన సంస్థలు టెండర్లకు అర్హత ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇంటర్‌ బోర్డులో కాంట్రాక్ట్‌ తీసుకుని సరిగా పనిచేయని కంపె నీలకు ఇంటర్‌ పేపర్ల వ్యాల్యూయేషన్‌ టెండర్లు ఇవ్వ బోమన్నారు. అంతేకాకుండా గతంలో ఇంటర్‌ విద్యా ర్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరినా కంపెనీకి కూడా ఇవ్వమని ఆయన చెప్పారు. ఈసారి ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్‌, కామర్స్‌, లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల జవాబు ప త్రాలను ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేయబోతున్నామని తెలిపారు. 600 నుంచి 700 వరకు రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నారని, 3వేలకు పైగా మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారని పేర్కొన్నారు. మ్యాన్యువల్‌గా పేపర్‌ మూల్యాంకనం చేయడానికి 3 రూపాయలు ఖర్చు అయితే ఆన్‌లైన్‌ పద్ధతిలో సుమారుగా ఒక రూపాయి ఖర్చు అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement