Thursday, September 21, 2023

దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ : ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయ‌క్

ఖానాపూర్, జూన్ 2 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే దిక్సూచిగా మారిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే త‌న‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి చౌక్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ లోని మార్కెట్ ఆఫీస్, ఎంపిడిఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖలో తెలంగాణ చౌక్ ఎమ్మార్వో కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎందరో మహనుభావులు, విద్యార్థుల త్యాగ ఫలితమే తెలంగాణ అని అన్నారు. తెలంగాణ వస్తే అంధకారమే అని అన్న నాయకులు నేడు కనుమరుగయ్యారని అన్నారు. దశాబ్దాల సమయం పట్టే అభివృద్ధికి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో సాధించి దేశంలోని అగ్ర రాష్ట్రాలను సైతం అబ్బురపరచిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కాళేశ్వరం లాంటి మహా నీటి ప్రాజెక్టులు కట్టి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజ గంగన్న, పర్మి సురేష్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోము చరణ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement