Sunday, October 13, 2024

TG: తెలంగాణ ధీరవనిత ఐలమ్మ… కేటీఆర్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తి చాకలి (చిట్యాల) ఐలమ్మ అని సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ… చాకలి ఐలమ్మను మహిళలోకం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement