Thursday, April 25, 2024

GHMC: ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసు వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడీ, యాదగిరిరావు, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సిసిపి శ్రీనివాసరావు, హౌసింగ్ ఎస్.ఇ విద్యాసాగర్, ప్రాజెక్ట్ ఎస్.ఇ లు వెంకటరమణ, రవీందర్ రాజు, ఎస్.డబ్ల్యూ.ఎం కోటేశ్వరరావు, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, చీఫ్ వెటర్నరీ డా. అబ్దుల్ వకీల్, సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, జాయింట్ కమిషనర్లు శశికళ, సంద్య, ఉమాప్రకాష్, స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా, పి.డి సౌజన్య, సెక్రటరీ లక్మిస్, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్నానన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు మలి దశ స్వరాష్ట్ర సాధనలో 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దశాబ్దానికి చేరుకున్నామన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలన ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ పథకాలను వినూత్న పద్దతిలో అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధికి నగర వాసులకు జీహెచ్ఎంసీ ద్వారా పూర్తి తోడ్పాటు అందిస్తున్నదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement