Monday, December 2, 2024

Telangana – గ్రూప్ – 1 మెయిన్స్ … అధికారుల‌తో సిఎస్ స‌మీక్ష …

హైద‌రాబాద్ : ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సచివాలయం నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించి సమీక్షించారు.

టీజీపీఎస్సీ కార్యాల‌యం నుంచి చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి, స‌భ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతార‌ని తెలిపారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 46 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అన్ని ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు సీఎస్ శాంతి కుమారి.

టీజీపీఎస్సీ చైర్మ‌న్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌డంతో.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement