Wednesday, April 17, 2024

TSLPRB – తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల ‘కీ’ విడుద‌ల

హైద‌రాబాద్ – తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ (సివిల్‌, టెక్నికల్‌)ఉద్యోగాలకు ఏప్రిల్ 30న మెయిన్స్‌ ప‌రీక్షలు నిర్వహించిన ఈ ప‌రీక్షల ప్రిలిమినరీ కీ ని తెలంగాణ పోలీసు నియామక మండలి నేడు విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్‌ (సివిల్‌), పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఐటీ తదితర పోస్టులకు సంబంధించిన తుది పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది. నేటి ఉదయం నుంచి ప్రిలిమిననరీ కీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tslprb.in/ లో అందుబాటులో ఉంది.
అయితే.. ఈ ప్రాథమిక ‘కీ’లో ఏమైనా అభ్యంతరాలుంటే.. మే 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చు. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని, అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
ఏప్రిల్ 30న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షకు 1,09,663 మంది (సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు) గానూ, 1,08,055 మంది హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6,801 మందికి గానూ 6,088 మంది హాజరయ్యారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. TSLPRB జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement