Friday, April 19, 2024

తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం: కేసీఆర్

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో దళిత బంధుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ దళితబంధు అమలుతీరు పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు ఆశక్తికర కామెంట్స్ చేశారు. హుజురాబాద్‌లో సర్వే ఎలా సాగుతోందని అధికారులను కేసీఆర్ అడిగారు. ఎక్కువ మంది అడుగుతున్న యూనిట్లు ఏంటని కేసీఆర్ ఆరా తీశారు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల అందజేత సమయంలో పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.

ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. కరెంటు ను నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా నిలబడి ది ప్రభుత్వం. అన్ని రంగాల ను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తి ని అందిస్తున్నదని తెలిపారు సీఎం కేసీఆర్.

దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం పరిపూర్ణ స్థాయిలో అన్ని కుటుంబాలకు దీనిని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: పవన్ రెండు చోట్ల ఓడిపోయిన మంచి నాయకుడు: ప్యూటీ సీఎం ధర్మాన

Advertisement

తాజా వార్తలు

Advertisement