Sunday, March 19, 2023

5న తెలంగాణ కేబినెట్ భేటీ

హైద‌రాబాద్ : ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉద‌యం 10:30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. 2023-24 బ‌డ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుప‌నుంది. మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ నాందెడ్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు.

- Advertisement -
   

గవర్నర్ ప్రసంగం తో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు రేప‌ట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రేపు మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీఏసీ. స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement