Thursday, April 18, 2024

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ

కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల్లో వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. జగన్ తో కుమ్కక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణ నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు.   కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ ఆపేస్తుందన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై టీఆర్ఎస్ నేతల విమర్శలు సరికాదన్నారు.

విభజన చట్టం ప్రకారమే రివర్ బోర్డుల పరిధిని కేంద్రం నోటిఫై చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేయడంవల్ల  తెలంగాణకు ఎట్లాంటి నష్టం జరగదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాను కచ్చితంగా వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా పక్క రాష్ట్రం అదనంగా తీసుకెళ్తున్న జల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులకు ఎట్లాంటి సంబంధం లేదని డీకే అరుణ అన్నారు. సీడబ్ల్యూసీ అప్రూవ్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు అనుమతి లేని ప్రాజెక్టులేమైనా ఉంటే వాటి డీపీఆర్ లు సమర్పించి 6 నెలల్లోగా అనుమతి తీసుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రం తీసుకున్న రివర్ బోర్డుల పరిధి నిర్ణయం తెలంగాణకు మేలు చేసేదేనేని అరుణ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు గమనిక .. పట్టాలెక్కనున్న 82 రైళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement