Wednesday, April 24, 2024

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలు, సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులు వెళ్లేందుకు వేర్వేరు ప్రవేశ ద్వారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

కాగా, ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో చర్చించే అంశాలు, పనిదినాలపై రేపు స్పష్టత రానుంది. దళితబంధు పథకం అమలు సహా పంటలసాగు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఉద్యోగాల నియామకం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా ఇతర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

ఇది కూడా చదవండి: మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement