Monday, September 20, 2021

చంచల్‌గూడ జైలుకు తీన్మార్‌ మల్లన్న తరలింపు

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం చిలకలగూడ పోలీసులు మల్లన్నను కస్టడీలోకి తీసుకున్నారు. జోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ కేసులో అరెస్ట్‌ అయిన తీన్మార్‌ మల్లన్నను తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో చిలకలగూడ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, క్రైంబ్రాంచ్‌ పోలీసులు నాలుగురోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు మధ్య మల్లన్నను జైలుకు తరలించారు. 

కాగా, జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శ‌ర్మ‌ను బెదిరించార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌తో తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు ఆగస్ట్ 27న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఆయనను హాజరుపరచగా.. సెప్టెంబర్‌ 9వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. అదే సమయంలో మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.   

ఇది కూడా చదవండి: తెలంగాణలో మత్స్యకారులకు శుభవార్త.. చేపపిల్లల పంపిణీ ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News