Thursday, March 28, 2024

కస్తూర్బా బడిలో పంతులమ్మల రాజకీయాలు : హెచ్చ‌రించిన డీఈఓ

చిన్నంబావి, (ప్రభ న్యూస్) : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో తరచూ పంతులమ్మలు రాజకీయాలు చేస్తూ చదువుకునే విద్యార్థినిలను ప్రేరేపిస్తూ చదువు ప్రక్కన పెట్టి ధర్నాలకు ప్రేరేపిస్తున్నట్లుగా సమాచారం. గతంలో ఇదే సమస్య ఇలాగే నెలకొని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. అప్పట్లో అదే పాఠశాలలో పనిచేసే పంతులమ్మల మాటలు విద్యార్థినిలు విని అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పుడున్న డీఈఓ సుశీoధర్ రావు సమస్య తెలుసుకుని ఇంటి గుట్టు బయట పెట్టడం మంచిది కాదని లోలోపల సమస్యను పరిష్కరింప చేశారు. ఆ మధ్య కాలంలో విజృంభించిన కరోన నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డ విషయం అందరికి తెలిసిందే.. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పకడ్బందీగా పాఠశాలలను నిర్వహిస్తూ ఉంటే బోధించే పంతులమ్మలు రాజకీయం చేస్తూ ఒకరిపై ఒకరికి ఓర్పులేక ఓర్వ జాలని బురదను విద్యార్థినిలపై చల్లే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.

గతంలో మాదిరిగా రెండు రోజుల క్రిందట మరోసారి అదే పాఠశాలకు చెందిన పంతులమ్మలే ధర్నాను ప్రేరేపించినట్లుగా అరకొర సమాచారం. విషయం తెలుసుకున్నవనపర్తి జిల్లా డీఈవో రవీందర్ ఈ విషయాలపై ఈరోజు మరోసారి పాఠశాలను సందర్శించి మాట్లాడుతూ… పంతులమ్మలైనా.. విద్యార్థులైనా.. చదువుపై శ్రద్ధ చూపాలి కానీ అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేస్తే అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గతంలో ప్రస్తుతం వనపర్తి జిల్లా పరిషత్ సభ్యురాలు కె సి రెడ్డి, వెంకట రమణ, చిన్నారెడ్డి, కొప్పునూరు గ్రామ సర్పంచ్ నంది కౌసల్య, రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, పాఠశాల ప్రత్యేక అధికారిని రమాదేవి, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement