Sunday, March 26, 2023

నెంబర్​ ప్లేట్​ ట్యాంపర్​​ చేస్తే భారీ ఫైన్​.. జైలు శిక్ష కూడా ఉండొచ్చు తస్మాత్​ జాగ్రత్త!

ట్రాఫిక్​ రూల్స్​ పట్టించుకోకుండా.. ఇష్టమున్నట్టు బండ్లను రోడ్లమీదికి తెస్తే పెద్ద మొత్తంలో ఫైన్​తోపాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నెంబర్​ ప్లేట్​ టాంపరింగ్​కు పాల్పడుతున్న వారిని పట్టుకుని ఫైన్​ వేశారు. ఫైన్​ నుంచి తప్పించుకునేందకు.. సీసీ కెమెరాలకు, ట్రాఫిక్​ పోలీసులకు చిక్కకుండా ఉండేదుకు కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, ఇట్లా చేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖమ్మం ట్రాఫిక్​ సీఐ అంజలి చెప్పారు. ఇవ్వాల (గురువారం) ఖమ్మం సిటీలోని పలు సెంటర్లలో స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు.

ఖమ్మ సిటీలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇ- చలాన్ నుండి తప్పించుకొవలని కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్‌, నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 30 వాహనాలకు ఫైన్​ విధించినట్లు ట్రాఫిక్ సీఐ అంజలి తెలిపారు. స్పెషల్​ డ్రైవ్​ చేపట్టిన సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కు బదులు మార్పిడి చేసి తిరుగుతున్నవాటిని గుర్తించి ఈ-చలానాల ద్వారా/ఫైన్​ విధించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ- చాలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనాలపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు ఖమ్మం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీసీ కెమెరాలలో అయా వాహనాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ మార్చడం, బైక్​ నెంబర్ కనబడకుండా వంకరగా పెట్టడం లేదా కట్ చేయడం వంటి తప్పుడు పనులు చేస్తే సరికాదన్నారు. ట్రాఫిక్​ రూల్స్​ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement