Tuesday, January 18, 2022

అమిత్ షాతో టీబీజేపీ నేతల సమావేశం రద్దు

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల సమావేశం రద్దయ్యింది. సీడీఎస్ బిపిన్ రావత్ మరణం కారణంగా ఈ సమావేశం రద్దు జరిగింది. సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు మరో 12 మంది చనిపోవడం భారత దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఈరోజు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్ఠీవ దేహాలు ఢిల్లీకి చేరనున్నాయి. ప్రత్యేక విమానంలో వీటిని తరలించనున్నారు. అందుచేత అమిత్ షాతో ఇవాళ జరగాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే భేటీ రద్దైంది. తెలంగాణలో బీజేపీ విస్తరణ, రానున్న ఎన్నికల కోసం ప్రణాళికపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించాల్సి ఉండగా రద్దు చేసినట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News