Thursday, April 18, 2024

పోలీసు కిష్టన్న త్యాగం మరువలేనిది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జూన్ 4:రాత్రనక పగలనక ప్రజల సేవకై కష్టపడి పనిచేసే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి ఫ్లై ఓవర్ వద్ద భారీ వాహన ర్యాలీని బెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

అశేషంగా హాజరైన పోలీసులు, పట్టణ ప్రజలు బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. ర్యాలీ అప్పన్నపల్లి, ఎనుగొండ, షాసాబ్ గుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ సర్కిల్ మీదుగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుంది. తెలంగాణ చౌరస్తాలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు..

.సమైక్య రాష్ట్రంలో 24 గంటలు 365 రోజులు సేవలో అందించిన పోలీసులకు అప్పుడు కనీసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశమే గత పాలకులు ఇవ్వలేదని… రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులకు ఉద్యోగ బాధ్యతల విషయంలో ఎంతో వెసులుబాటు లభించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు హోంగార్డులకు నెలకు కేవలం రూ.5000 వేతనం ఏర్పడిన తర్వాత వారికి రూ.30 వేల జీతం వస్తున్నదని అన్నారు. 2014కు ముందు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో తెలియని భయంకరమైన పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు రాజకీయాల కోసం, ముఖ్యమంత్రిని మార్చడం కోసం మతకలహాలు సృష్టించి అశాంతిని రాజేసేవారని అన్నారు.

మహబూబ్ నగర్ లోనూ అలాంటి వాతావరణం ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఏనాడు అలాంటి ఘర్షణ వాతావరణమే లేకుండా చేయడంలో మన పోలీసుల పాత్ర ఎంతో విలువైనదన్నారు. లక్షల కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ దేశానికి ఆదర్శంగా నిలిస్తోందన్నారు. సింగపూర్లో ఆదర్శంగా తీసుకొని ఏర్పాటు చేసిన నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో రూపొదిద్దుకొందన్నారు. *అప్పుడు ఎస్పీని కలిసేందుకు కూడా కష్టమే…*సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా వైశాల్యంలో ఎంతో పెద్దదని… అలాంటి పరిస్థితుల్లో కనీసం జిల్లా ఎస్పీని, కలెక్టర్ ను కలిసి తమ సమస్యను వివరించేందుకు కూడా అవకాశం కూడా లభించేది కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

ఇప్పడు చిన్న జిల్లాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో సులభతరమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అంటే భయం పోయి గౌరవం పెరిగిందని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులు ఇంట్లో ఉండే బాధలు ఎవరికీ తెలియదన్నారు. ఫ్రెండ్లీ హోలీసింగ్ తో పాటు తప్పు చేసిన వారిని ఘనంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎక్సైజ్ పోలీసులు కుటుంబాలు అరికట్టడంలో కీలకపాత్ర వహించారని ఆపద సమయంలో అగ్నిమాపక పోలీసులు పాత్ర వేల కట్టలేనిదని తెలిపారు. జైళ్ల శాఖ, అటవీశాఖ పోలీసులు సైతం నిరంతరం ప్రజాసేవలో కష్టపడుతున్నారని అన్నారు.

*రాష్ట్ర సాధన కోసం పోలీస్ కిష్టన్న అమరుడు

తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని, బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయని పోలీస్ కిష్టన్న ఉద్యమంలో అమరుడయ్యాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఉప ఎన్నికల్లో కొందరి ఓటములతో స్తబ్దత వచ్చిన తరుణంలోనే 14 ఎఫ్ ద్వారా హైదరాబాద్ ను గుప్పిట పెట్టుకునాలని సమైక్యవాదుల కుట్రకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు సోదరుల సహకారం మరువలేనిదని మంత్రి గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాతే సిద్దిపేట సమావేశం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ఉద్యమంలో ప్రతి సందర్భంలోనూ పోలీసులు తమకు సహకారం అందించి రాష్ట్ర సాధనకు చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు.

తెలంగాణ చౌరస్తా నుంచి శిల్పారామం వరకు…

తెలంగాణ చౌరస్తాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగం తర్వాత వాహన ర్యాలీ ఎస్పీ కార్యాలయం, క్లాక్ టవర్, బండ్లగేరి, రామ్ మందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్ టౌన్, భగీరథ కాలనీ, బికే రెడ్డి కాలనీ మీదుగా శిల్పారామానికి చేరుకుంది.

కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ జీ రవి నాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ మహేష్, సీఐలు రాజేశ్వర్ గౌడ్, ప్రవీణ్, స్వామి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement