Sunday, January 23, 2022

సండే ఫన్‌డేకు చార్మినార్ రెడీ!

ప్రభ న్యూస్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ : యాంత్రిక జీవనంతో అలసిపోతున్న నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.. క్షణం తీరిక లేకుండా జీవన పోరాటంలో మునిగితేలే జీవితాల్లో ఆనందక్షణాలను నింపుతూ.. మధుర జ్ఞాపకాలుగా మలిచేందుకు చేపడుతున్న ప్రోగ్రాములు ప్రజల ప్రశంసలు పొందుతున్నాయి… ఈ క్రమంలోనే కొద్దివారాలుగా నిర్వహిస్తున్న సండే పన్‌డే కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా చార్మినార్‌ను సైతం వేదికగా మలచారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దీంతో హుస్సేన్‌సాగర్‌తో పాటు.. చార్మినార్‌ పరిసరాలు ఈ రోజు నుంచి సందడికి సై అంటున్నాయి.

హైదరాబాద్‌కు మణిహారంలా నిలిచిన చార్మినార్‌ను నగరవాసులకు మరింత చేరువచేసేందుకు మున్సిపల్‌ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి ఆదివారం ట్యాంక్‌ బండ్‌ వద్ద నిర్వహిస్తున్న సండే ఫన్‌డే మాదిరిగా చార్మినార్‌ వద్ద ఈ ఆదివారం నుంచి నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.. ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌’ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఇందులో భాగంగా చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు.. పిల్లలను ఆకట్టుకొనేలా కార్యక్రమాల నిర్వహణతో పాటు, భోజన ప్రియులకు నోరూరించేలా ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. సందర్శకులను ఆకట్టుకొనేలా కార్యక్ర మాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్యాంక్‌బండ్‌ తరహాలో..
భాగ్యనగరవాసులకు ప్రతి ఆదివారం ఆహ్లాదాన్ని అందించేలా ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న సండే ఫన్‌డే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పిల్లలు, పెద్దలు, యువత భారీగా తరలి వచ్చి సాయం త్రం వేళ ట్యాంక్‌ వద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరానికే మణిహారంలా నిలిచిన చార్మినార్‌ చెంత సన్‌డే ఫన్‌డే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు మున్సిపల్‌ పరిపాలన, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యం లో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేశారు. ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌ పేరిట సందర్శకులను ఉత్సాహపర్చేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చార్మినార్‌ వద్ద సందర్శకులను అలరించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు పోలీస్‌ బ్యాండ్‌తో పాటు రాత్రి 8.30గంటలకు దక్కనీ మజాహియా ముషారి యా ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయనున్నారు.

ఇక అర్ధరాత్రి వరకు లాడ్‌ బజార్‌ను తెరిచి ఉంచను న్నారు. పిల్లలను ఆకట్టు-కునే విధంగా పలు కార్యక్ర మాలకు రూపకల్పన చేశారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు- చేయనున్నారు. సండే – ఫన్‌డేకు వచ్చే వాహనదారులకు పార్కింగ్‌ సదుపాయాలు కల్పించామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలియచేశారు.

3గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు..
ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌ పేరిట నిర్వహిం చనున్న కార్యక్రమాల్లో భాగంగా చార్మినార్‌ పరిసరాల ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు నగర సీపీ అంజనీ కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఆదివారం మధ్యా హ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇందుకోసం అప్జnల్‌ గంజ్‌, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌజ్‌ నుంచి మెట్టికాషేర్‌, కాలికమాన్‌, ఎతేబార్‌ చౌక్‌ వైపు మళ్లించానున్నారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌ పురా నుంచి వచ్చే వాహనాలు పంచమొహళ్ల నుంచి షా ఫంక్షన్‌ హా, మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ రోడ్‌, బీబీ బజార్‌ వైపు మళ్లించనున్నారు. బీబీబజార్‌, మొఘల్‌ పురా వాటర్‌ ట్యాంకు, హఫీజ్‌ దంకా మసీదు నుంచి వచ్చే వాహనాలు సర్దార్‌ మహల్‌ వద్ద కోట్ల అలీజా, ఎతేబార్‌ చౌక్‌ వైపు మళ్లించనున్నారు. మూసాబౌలీ, ముర్గీచౌక్‌, ఘాన్సీ బజార్‌ నుంచి వచ్చే వాహనాలను లాడ్‌ బజార్‌, మోతీగల్లి వద్ద ఖిల్వత్‌ రోడ్‌ వైపు మళ్లించనున్నారు.
అప్జల్‌ గంజ్‌, నయాపూల్‌, మదీనా వైపు నుంచి వచ్చే వారికి సర్దార్‌ మహల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం, కోట్ల అలీజా బాయ్స్‌ హైస్కూల్‌, మదీనా ఎస్‌వైజే కాంప్లెక్స్‌, చార్మినార్‌ ఏయూ ఆసుపత్రి, చార్మినార్‌ బస్‌ -టె-ర్మినల్‌ ఇన్‌ గేట్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు- చేసినట్లు సీపీ తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ముర్గీచౌక్‌, షాలిబండ వైపు నుంచి వచ్చే వారికి మోతీగల్లి పెన్షన్‌ ఆఫీస్‌, ఉర్దూ మస్కాన్‌ ఆడిటోరియం, ఖిల్వత్‌ గ్రౌండ్‌, చార్మినార్‌ ఏయూ ఆసుపత్రి, చార్మినార్‌ బస్‌ టర్మినల్‌ ఇన్‌గేట్‌ వద్ద

పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.
మదీనా, పురానాపూల్‌, గోషామహల్‌ వైపు నుంచి వచ్చే వారికి కులీకుతుబ్‌ షా స్టేడియం, సీటీ- కళాశాల, ఎంజే బ్రిడ్జ్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు, సాధారణ ప్రజలు చార్మినార్‌ మార్గం బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News