Thursday, November 28, 2024

Sucide – బాసర ఐఐఐటి లో రాలిన మరో విద్యాకుసుమం

బాసర ఐఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలతో సూసైడ్

ఘ‌ట‌నా స్థ‌లంలో సూసైడ్ నోట్ లభ్యం?

కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం

- Advertisement -

కేసు న‌మోదు చేసిన పోలీసులు

బాసర, (ఆంధ్రప్రభ) : బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది మృతదేహాన్ని బైంసా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హాస్ట‌ల్ గ‌దిలోనే.

.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియ ఐఐఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్ గదిలోనే ఆత్మ‌హ‌త్య‌కు చేసుకోగా.. మృతురాలి వ‌ద్ద సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. కాగా, వ్యక్తిగత కారణాలతోనూ సూసైడ్‌కు పాల్పడినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు, బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement