Monday, December 9, 2024

Success Story – పల్లె బడిలో న్యాయ దేవత!

కార్యదక్షత, క్రమశిక్షణ, సామాజిక స్పృహ కలగలిసిన మేఘన ఓ నయా న్యాయమూర్తిగా సమాజంలో ప్రత్యక్షం కావటం వెనుక.. ఈ చిట్టి తల్లి అమ్మానాన్న నిర్ణయం సాధారణ విషయం కాదు. తండ్రి గడ్డం పురుషోత్తం ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉద్యోగి. చదువు సంధ్యల్లో మేలిమి బంగారంలా రాణిస్తున్న తన ఏకైక కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన చెందలేదు. డాక్టర్ కావాలని ఆశిసించలేదు. కనీసం ఇంజనీర్ చదవాలని తన బిడ్డపై వత్తిడి చేయలేదు. ఆమెకు ఇష్టమైన భవిష్యత్తుకు ఆయన పునాది వేశారంటే.. ఆయన అభినందనీయుడే కాదు.. సభ్య సమాజంలో తల్లిదండ్రులకు స్ఫూర్తి ప్రదాతే.

నిజంగా మేఘమే..

గగనంలో మేఘం కనిపించగానే …. అన్నదాత కళ్లల్లో ఆనందం వర్ణనాతీతం. నిజంగా ఓ పల్లె పసిడి అక్షర తల్లి నేడు న్యాయమూర్తిగాఅన్యాయ కంటకుల బారిన తల్లడిల్లుతున్న బాధితులను ఆదుకుని ఓదార్చే న్యాయదేవతగా ఆవిష్కరించటానికి వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకోవాల్సిందే. అది ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. కాశీపేట మండలం, దేవపూర్ గ్రామంలో.. పుట్టిన గడ్డం మేఘన, అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఓనమాలు దిద్దింది. జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదివింది. తన సహజ ప్రతిభకు ఉపాధ్యాయుల సాన పట్టారు. చదువుల వజ్రంగా తీర్చిదిద్దారు. పదవ తరగతిలో 9.8 సీజీపీఏ స్థాయి మార్కులతో ఘర్జించింది. .రాజధానికి చేరింది. ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో చరిత్ర సృష్టింది.

ఎంసెట్​ మాయలో పడకుండా..

అందరిలా ఎంసెట్ ఘోషలో పడలేదు. తల్లి దండ్రులు అప్పులు చేసి కార్పొరేట్ కాలేజీలకు పంపిస్తే.. ఎంసెట్లో ర్యాంకులు రాక ఆత్మహత్య చేసుకునే పిల్లల్లా ఆలోచించలేదు. తల్లిదండ్రీ ఆమెపై ఎంసెట్ వత్తిడి తీసుకురాలేదు. చక్కగా తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన జడ్జీ కావాలనే ఆకాంక్షతో.. న్యాయవిద్య శాస్త్ర అధ్యయనంపై దృష్టి సారించింది. ఉస్మానియా వర్సటీలో న్యాయశాస్త్రంలో పట్టాను సాధించి.. మరో చరిత్ర సృష్టించారు. జస్టిస్తడకమళ్ల నర్సింగరావు స్మారక బంగారుపతకం, రుద్రరాజు మహాలక్ష్మీ బంగారు పతకంతో 2021 -.. 22లో న్యాయవాదిగా యూనివర్సీటీ నుంచి బయటకు వచ్చారు. ఇక అడ్వోకేట్గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఉద్యోగ ప్రయత్నంలో కసరత్తులు ప్రారంభించారు..గత ఏప్రిల్లో జూనియర్ జడ్జీల నియామకం కోసం స్టేట్ పోస్టు గ్రాడ్యుయేట్ లా కమిషన్ ఎంట్రెన్స్ టెస్ట్లో రాష్ట్రంలోనే మూడవ ర్యాంకును మేఘన సాధించారు. అంతే కాదు జూనియర్ జడ్జీల నియామ పరీక్షలో.. కేవలం ఇద్దరు మహిళ న్యాయమూర్తులు ఎంపిక కాగా.. ఇందులో మేఘన సెలెక్ట్ అయ్యారు. దేవపూర్ కీర్తిని ఎగురవేశారు.

ఇది చిన్ననాటి కల.. మేఘన

- Advertisement -

దేశంలోనే న్యాయవ్యవస్థ అత్యుత్తమం. ఈ న్యాయవ్యవస్థ అంటే అపారగౌరవం. చిన్నప్పటి నుంచే జడ్జీలంటే అమితమైన ఇష్టం. అందుకే న్యాయ శాస్త్రానికి ఆకర్షితురాలినయ్యా. నైతిక విలువలను కాపాడుకోవటానికి న్యాయశాస్త్రం దోహదం చేస్తుంది. న్యాయమూర్తిగా బాధితులకు న్యాయం జరగాలన్నదే నా అభిలాష, న్యాయ వ్యవస్థలో ప్రవేశంతో కేవలం ఉద్యోగం గ్యారెంటీ చదువులనే ఇష్టపడే ఆడబిడ్డలకు నేను ఓ ఉదాహరణ కావాలి, ఇదే నా ఆకాంక్ష”

= గడ్డం మేఘన, జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ

Advertisement

తాజా వార్తలు

Advertisement