Friday, May 20, 2022

సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి .. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వం 65 % సబ్సిడీ పై అందిస్తున్న జీలుగు,జనుము విత్తనాలను పెద్దపల్లి పట్టణంలోని గోదాంలో రైతులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒకటే ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వ్యవసాయ అధికారులు ఆదిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, అలివేణి , రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement