Wednesday, April 24, 2024

మోకాళ్లపై కూర్చొని విద్యార్థుల నిరసన..

సూర్యాపేట, ప్రభ న్యూస్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో 60 ఫీట్ల రోడ్డులో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేయాలని విద్యార్థి సంఘాలు తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్(TSF) రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్(RVSP) జన సేవా సమితి(JSS) ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులను వెంటనే ప్రమోట్ చేయాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తు అమాయక విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే విద్యార్థులకు తగు న్యాయం చేయాలని అన్నారు. కనీసం చనిపోయిన ప్రతి విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా 30 లక్షల చొప్పున ఇవ్వాలని మోకాళ్ళపై నడుస్తూ నిర‌స‌న చేశారు. ఈ కార్యక్రమంలో బారి అశోక్, బంట్టు సందీప్, తగుళ్ళ జనార్దన్ యాదవ్, లావురి వాసు నాయక్,దినేష్, తరుణ్, స్రవంతి, ప్రసన్న,గిరి ,నరేష్, గోవర్ధన్, అశ్విని, అంజలి, శిరీష, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement