Wednesday, March 27, 2024

ఓయూలో 90దేశాల స్టూడెంట్స్.. రికార్డు కొట్టిన యూనివర్సిటీ..

ప్ర‌భ‌న్యూస్: వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ఘనతను తన సొంతం చేసుకుంది. ఓయూలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా ప్రపంచంలోని 90 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వారు సులువుగా విద్యా సమాచారాన్ని పొందేందుకు వీలుగా ఓయూ వెబ్‌సైట్‌ను 27 భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌లో సమాచారం కేవలం ఇంగ్లీష్‌ భాషలోనే అందుబాటులో ఉండేది. అయితే ఓయూ డైరెక్టర్‌ ప్రొ.పి.నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ఐటీ బృందం 27 భాషల్లో ఈ వెబ్‌సైట్‌ను రూపిందించింది.

వారి వారి మాతృ భాషల్లో సమాచారం పొందాలనే ఉద్దేశంతో హిందీ, తెలుగు, మళయాళం, ఉర్దూ, అరబిక్‌, తమిళం, సంస్కృతం, మరాఠీ, గుజరాతీ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జర్మన్‌, ఫ్రెంచ్‌, గ్రీక్‌, డచ్‌, స్పానిష్‌, చైనీస్‌, రష్యన్‌, పర్షియన్‌, లాటిన్‌, నేపాలీ, జపనీస్‌, ఇటాలియన్‌, ఇండోనేషియన్‌, హంగేరియన్‌, ఐరిష్‌, మంగోళియన్‌ వంటి విదేశీ భాషల్లో వెబ్‌సైట్‌ను అనువదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement