Monday, December 2, 2024

ADB | జ్యోతి బా పూలే పాఠశాలలో విద్యార్థి మృతి…

నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): నిర్మల్ పట్టణంలోని జ్యోతి బా పూలే బాలుర పాఠశాల విద్యార్థి ఇవాళ‌ ఉదయం ఆకస్మికంగా మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న ఆయన్ హుస్సేన్ ఉదయం తీవ్రమైన తలనొప్పి, చెమటలు వచ్చాయి. దీంతో హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement