Saturday, October 12, 2024

జగిత్యాలలో ఆర్టీసి బస్సు పై రాళ్ల దాడి – పలువురి ప్రయాణికులకు గాయాలు

జగిత్యాల జిల్లాలో. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

హుజురాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూలాగానే తెల్లవారు జామున నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ కు బయలు దేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని అపాయం ముంచుకొచ్చింది. జగిత్యాల మంచినీళ్లబావి సమీపానికి రాగానే ఒక్కసారిగా రాళ్లుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనుక నుంచి రాళ్లు విసరటంతో బస్సు అద్దాలు పగిలి మెట్‌పల్లికి చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో 75 మందిప్రయాణిస్తున్నట్లు బస్సు కండక్టర్‌ తెలిపారు. బస్సు వెనుక నుంచి అనుసరిస్తున్న యువకులు దాడిచేసి పారిపోయారని కండక్టర్‌ పేర్కొన్నారు. డ్రైవర్‌, కండెక్టర్‌ అప్పమత్తమై బస్సును పక్కనే ఆపారని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. డ్రైవర్‌, కండక్టర్‌ పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బస్సుపై రాళ్లదాడి చేసిన వ్యక్తి ఎవరు? మద్యం సేవించి రాళ్లదాడి చేశాడా? లేక బస్సులు వాళ్లకు సంబంధించిన వారిపై రాళ్లదాడి చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement