Thursday, May 26, 2022

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి-ప్రభుత్వ విప్ సుమన్

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ గ్రంథాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ .. జిల్లా గ్రంథాలయసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోటీ పరీక్షలు గ్రూప్ -2, 3, 4, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ తదితర కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని, పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి భారతి హోలికెరీ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement