Friday, March 29, 2024

ఉద్యోగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : మంత్రి తలసాని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈనెల 26న వాటర్‌ వర్క్స్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నుంచి ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా పోటీలో ఉన్న రాంబాబు యాదవ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ప్రభుత్వానికి ఉందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైన తాను ఎల్లాప్పుడూ అందుబాటులో ఉంటాన్నారు. వాటర్‌ వర్క్స్‌ ఉద్యోగుల సమస్యలను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

వాటర్‌ వర్క్స్‌ సేవలు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులపై పనిభారం పడకుండా కొత్త ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. వాటర్‌ వర్క్స్‌ ఉద్యోగుల కోసం హెల్త్‌కార్డులు జారీ చేసి, రూ.7 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా విధులు నిర్వహించిన క్షేతస్థాయి వాటర్‌ వర్క్స్‌ క్షేత్రస్థాయి ఉద్యోగులకు రూ.7500 ప్రోత్సాహకాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement