Thursday, March 28, 2024

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ఉధృతి

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కందకుర్తి వద్ద గోదావరి నది నాలుగో రోజు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఇరిగేషన్ అధికారులు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి, మంజీరా నది ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఉదయానికి గోదావరి ఉధృతి భారీగానే ఉంది.

ఇది కూడా చదవండి: మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన దుర్గార్ములు..

Advertisement

తాజా వార్తలు

Advertisement