Monday, October 14, 2024

TG | యాదగిరి కొండపైన లంబోదరుడికి విశేష పూజలు…

యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్థిని సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆనవాయితీగా కొండపై ఆలయంలో వినాయకుడి ఉప ఆలయంలో పూజలు చేపడుతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, వినాయక వ్రతం, మహా నివేదన హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రితో పాటు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది మట్టి గణనాథులకు పెద్దపీట వేయగా, వివిధ రూపాల్లో వివిధ గణనాథులను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు యాదగిరిగుట్ట పట్టణవాసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement