Tuesday, December 10, 2024

HYD | మధురానగర్‌లో జాన్వీక‌పూర్‌.. హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఫొటోలు, సెల్ఫీల‌కు ఎగ‌బ‌డ్డ స్థానికులు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు దైవ భక్తి పెరిగింది. తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల వేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆమె హైదరాబాద్‌లోని మధురానగర్‌ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అరగంట సేపు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్వీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు.

దేవ‌ర హిట్‌తో తెలుగులోనూ క్రేజ్‌…
జాన్వీకపూర్‌ తెలుగులో నటించిన తొలి సినిమా దేవరతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మంచి వసూళ్లను సాధించింది. తాజాగా తెలుగులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. మరో బంపరాఫర్‌ ఆమె తలుపు తట్టినట్లు తెలుస్తున్నది. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ఈరం (వైశాలి) సినిమా హిందీ రీమేక్‌కు జాన్వీ ఓకే చెప్పినట్లు సినీవర్గాల టాక్‌. 2009లో విడుదలైన ఈ తమిళ సినిమాను డైరెక్టర్‌ శంకర్‌ నిర్మించగా, అరివళగన్‌ దర్శకత్వం వహించారు. హిందీ రీమేక్‌లో జాన్వీకపూర్‌ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీనిద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస దర్శకుడిగా పరిచయం కానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement