Wednesday, December 4, 2024

TG: 11న సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్.. ప్రారంభించనున్న ఉత్త‌మ్

ఈనెల 11న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో ముందుగా ట్రయల్ రన్ నిర్వహించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా రెండో పంప్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అటు నుండి 3వ పంప్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని వైరాకు చేరుకుంటారు. అక్కడ ఈనెల 15న నిర్వహించ తల పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఆయన పరిశీలిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement