Thursday, April 25, 2024

బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి దృష్టి

దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఐ.ఎ.ఎస్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలో లభిస్తున్న బొగ్గు ఉత్పత్తి నిలువలు రవాణా సౌకర్యాల గురించి చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు కు డిమాండ్ ఉన్నందున రోజువారి లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని  అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్, శ్రీరాంపూర్ ఏరియా గనుల ఏజెంట్లు, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు.. నాని పార్టీ మారుతారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement