Thursday, April 18, 2024

ఆవు, గేదె వెన్న విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

సహజసిద్ధమైన, కల్తీలేని ఆవు, గేదె వెన్నను సాల్టెడ్‌, అన్‌ సాల్టెడ్‌ అవకాశాలలో విడుదల చేసినట్లు సిద్స్‌ ఫార్మ్‌ వెల్లడించింది. ఫార్మ్‌ టు ప్లేట్‌ కల్తీలేని వెన్నను తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఈసంద‌ర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ… ట్రెండ్స్‌ మారుతూనే ఉన్నాయన్నారు. వినియోగదారులు ఇప్పుడు పోషక విలువలపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని. అదే సమయంలో కల్తీలేని ఉత్పత్తులు, అదీ సహజసిద్ధమైన వాటిని కోరుకుంటున్నారన్నారు. సిద్స్‌ ఫార్మ్‌ విడుదల చేసిన ఆవు, గేదె వెన్నలు సాల్టెడ్‌, అన్‌సాల్టెడ్‌ రకాలలో లభ్యమవుతాయని అన్నారు. సిద్స్‌ ఫార్మ్‌ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆవు వెన్న ప్యాక్‌లు, గేదె వెన్నలా 740 కిలో కేలరీ శక్తిని, 0.6 గ్రాముల ప్రొటీన్‌ కలిగిఉండటంతో పాటుగా సహజసిద్ధమైన పోషక విలువలు కలిగి ఉంటాయన్నారు. కల్తీ జరుగనటువంటి రీతిలో జరిగే ప్రాసెసింగ్‌ తో పాటుగా ఈ రెండు రకాల వెన్నలూ విటమిన్‌ ఏ,డీ, ఈ కలిగి ఉన్నాయనే భరోసా అందిస్తాయన్నారు. రుచిపరంగా గేదె వెన్నను బేకింగ్‌ ఉత్పత్తులలో వాడితే, ఆవు వెన్నను బ్రెడ్‌, వంటలలో వినియోగించవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement