Tuesday, March 28, 2023

Siddipet: జీపు, కారు ఢీకొని : 10 మందికి తీవ్ర గాయాలు

ఓ జీపు, కారు ఢీకొన్న ప్ర‌మాదంలో ప‌దిమంది తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement