Friday, April 26, 2024

ట్రైనీ ఎస్ఐపై మరిపెడ ఎస్‌ఐ లైంగిక దాడి

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస రెడ్డిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌ జోషి ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ శ్రీనివాస రెడ్డి తనపై  లైంగిక దాడికి పాల్పడినట్లు ట్రైనీ మహిళా ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించింది. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం అతడిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement