Thursday, April 18, 2024

నిరుద్యోగుల కోసం వనపర్తిలో వైఎస్ షర్మిల దీక్ష..

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల అప్పుడే పోరు బాట పట్టారు.. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల అందులో భాగంగానే ఇవాళ ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు, ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే వ‌ర‌కు తాను పోరాడ‌తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షర్మిల ఈ రోజు ఈ డిమాండ్ తో దీక్ష ప్రారంభించారు. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువ‌కుడు ఉద్యోగం రావ‌ట్లేద‌ని మ‌న‌స్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. కొండల్‌ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వ‌న‌ప‌ర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొన‌సాగుతుంది. అంతేకాదు రాష్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement