Friday, November 8, 2024

ADB | రెండ్లగూడవాసికి ఎస్జీటీ టీచర్ ఉద్యోగం…

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలములోని రేండ్లగూడకు చెందిన చెట్పల్లి వనజ ఎస్జీటీ టీచరు ఉద్యోగం పొందింది. ఆ గ్రామానికి చెందిన రైతు చెట్పల్లి శంకరయ్య, సతవ్వ దంపతులు కుమార్తె వనజ మండలంలోని రేండ్లగూడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి, కిష్టాపూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది.

ఇంటర్మీడియట్, డిగ్రీ మండల కేంద్రంలోని కరిమల జూనియర్ కాలేజ్ లోను, వికాస్ డిగ్రీ కళాశాలలో చదువుకుంది. నిజామాబాద్ లోని ప్రభుత్వ డైట్ కాలేజీలో డీఇడీ, కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీగిర్వాణ కాలేజీలో బీఈడీ మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది.

ఆ తర్వాత డీఎస్సీ రాసి, ఆ డీఎస్సీలో 74.60 మార్కులు పొంది, జిల్లాస్థాయిలో 85వ ర్యాంకు సాధించింది.దీంతో ఆమె ఎస్.జి.టి టీచర్ ఉద్యోగానికి ఎంపికై, టీచర్ నియామక పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆమె అందుకుంది. ఈ సందర్భంగా ఆమెను మిత్రులు, పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement